ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో విజయం మాదే. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ ,మేజర్ న్యూస్ ;ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో విజయం మాదే అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ లో రెండో రోజు సందర్భంగా మా అభ్యర్థులు ఎంతో ఉత్సాహంతో నామినేషన్ వేయడం జరిగిందన్నారు ప్రజలకు మంచి చేయాలని సంకల్పంతో ఆళ్లగడ్డ అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగడం జరిగింది అని అన్నారు. ప్రజలకు అభివృద్ధి చేసి చూపించి ఓ ట్లు అడుగుతున్నామ న్నారు. మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా యని తాగునీటి సమస్య తలెత్తకుండాచర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు . ప్రజల అభివృద్ధిని కళ్ళ ముందే చూస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలని వైసిపి వాళ్ళు ప్రజాక్షేత్రం లోకి వచ్చి , ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. ఆళ్లగడ్డలో ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా ఎన్నికల సంఘం, అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని అన్ని పార్టీలు ఎన్నికల నియమాలను గౌరవిస్తూ సహకరించాలని కోరుతున్నాన న్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఆళ్లగడ్డలో కూడా రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మా అభ్యర్థులుభారీ మెజారిటీతో విజయం సాధిస్తారనే పూర్తి నమ్మకం మాకు ఉందన్నారు. ప్రజలు అభివృద్ధిని గమనించి, తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించు కోవాలని సూచించారు ఆళ్లగడ్డను మరింత అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు. తెదేపా యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, కేంద్ర కాటన్ బోర్డు మాజీ డైరెక్టర్ సిపి శ్రీనివాస్ రెడ్డి (వాసు) ఉన్నారు.
కరణం శ్రీనివాస రావు, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా.