|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 03:55 PM
మాదాపూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. బసవలింగం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథిగా విచ్చేసిన హెచ్ సీ యూ ప్రొఫెసర్ ఎస్. సుధాకర్ బాబు విద్యార్థుల ప్రాముఖ్యతను, కలాం సేవలను, విజన్ 2020ను, విద్యార్థులకు ఆయన ఇచ్చిన ప్రేరణను గుర్తుచేశారు. సాంకేతిక నైపుణ్యాలు సంపాదించి, చెడు అలవాట్లకు దూరమై దేశాభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.