|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 03:30 PM
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికల ప్రక్రియ వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీత తన నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఈరోజు ఆమె షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తొలి సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అత్యంత పట్టుదలగా ఉంది.ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 24వ తేదీ వరకు గడువు విధించారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.