|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 12:28 PM
పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలో సద్దుల బతుకమ్మ పండుగను సెప్టెంబర్ 29, సోమవారం రోజున, దసరా పండుగను అక్టోబర్ 2, గురువారం రోజున నిర్వహించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. శనివారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో పండుగ తేదీలపై స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన.సమావేశం నిర్వహించగా..స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 29వ తేదీ, సోమవారం సాయంత్రం పట్టణంలోని సాకి చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దసరా పండుగను అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 05:00 గంటలకు జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ద్వజారోహన నిర్వహించి, జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శమీ చెట్టుకు పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు మైత్రి మైదానంలో మహిషాసుర దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జడ్పీటీసీలు జైపాల్, మాణిక్యం, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానదేవ్, నరసింహ చారి, నర్రా బిక్షపతి, ప్రకాష్ రావు, పట్టణ పుర ప్రముఖులు, పురోహితులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.