|
|
by Suryaa Desk | Fri, Sep 12, 2025, 03:25 PM
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 106వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ గోపి నగర్ కాలనీలో మన బస్తి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవి యాదవ్ ఉదయం 7 గంటలకు గోపి నగర్ చేరుకొని స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. *నీటి సమస్యలు, రహదారులు, పారిశుద్ధ్య సమస్యలు, ప్రస్తుత కరెంటు పోల్ సమస్య, మౌలిక వసతుల లోపాలు వంటి ఎన్నో అంశాలను ప్రజలు రవి యాదవ్ కు వివరించగా, ఆయన వాటిని త్వరగా పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.* *సీనియర్ సిటిజన్ మహిళలు తమ సమస్యను వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం పెన్షన్ పథకం ఇవ్వడం లేదు, కేసీఆర్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని వారు మరోసారి అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలోప్రజలతో మమేకమై సమస్యలను విన్న రవి యాదవ్ మాట్లాడుతూ, *“ప్రజలకు కావలసిన సదుపాయాలు కల్పించడం నా కర్తవ్యం. సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి కష్టాలకైనా వెనుకడుగు వేయను .” అని స్పష్టం చేశారు. స్థానిక కార్పొరేటర్ , స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు కేవలం స్వప్రయోజనాలకే పరిమితమై, ప్రజా సమస్యలను విస్మరించారని రవి యాదవ్ మండిపడ్డారు. *ఈ పరిస్థితుల్లో ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రవి యాదవ్ తీరుపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. గోపి నగర్ అభివృద్ధి కోసం ఆయన చేపట్టిన ఈ కృషి సానుకూల ఫలితాలను అందిస్తుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.* ఈ కార్యక్రమం లో మల్లేష్ ముదిరాజ్, స్వామీనాథ్, వెంకటరెడ్డి, వెంకట చారీ, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం యాదవ్, గడ్డం శ్రీనివాస్, సురేష్ యాదవ్, గడ్డ మహేష్, గంగాధర్ గౌడ్, కొండకల శ్రీనివాస్, నవీన్ గౌడ్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, స్వామి, రాజు గౌడ్, వడ్డే శ్రీనివాస్, జంగయ్య, ప్రవీణ్ యాదవ్, అనిల్ యాదవ్, బాలరాజు, శంకర్, మున్నా, రాజు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, నర్సింహా, దివ్య, నిరూప, నాగమణి తదితరులు పాలుగోన్నారు.