|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 08:12 PM
BRS పార్టీ ట్విట్టర్ పోస్టును రీపోస్ట్ చేసినందుకు నల్ల బాలు పై కరీంనగర్, రామగుండం, గోదావరిఖని పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసి, 20 రోజులు జైలుకు పంపారు.ఈ తప్పుడు కేసులపై BRS లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించి గట్టి వాదనలు వినిపించగా, గత జూలై నెలలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు, నేడు సంచలన తీర్పు వెలువరించింది.పొలిటికల్ సోషల్ మీడియా కేసులు నమోదు చేసేముందు పోలీసులు తగిన గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రాజకీయ విమర్శలు చేసే హక్కు ప్రతి పౌరునికి ఉందని కోర్టు స్పష్టం చేసింది.ఫిర్యాదులు వస్తే వెంటనే కేసులు నమోదు చేయకుండా, ముందుగా న్యాయ సలహాలు తీసుకోవాలని పోలీసులు స్పష్టంగా ఆదేశించింది. ముందస్తు ఎంక్వైరీ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయరాదని హైకోర్టు సూచించింది.అలాగే, ఈ గైడ్‌లైన్స్‌ను వెంటనే డీజీపీకి పంపించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది.