|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 07:55 PM
ఈరోజు ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ లోని ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహానికి మన ప్రియతమ నాయకురాలు కాట సునీతమ్మ స్వయంగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సునీతమ్మ గారు మాట్లాడుతూ – “చాకలి ఐలమ్మ గారి గోపతనం సర్వసమాజానికి ఎప్పటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఐలమ్మ తల్లి చూపిన ధైర్యం, సమానత్వం కోసం పోరాటం ప్రతి తరానికి ప్రేరణ” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా పెద్దలు నర్సింహ గారు, అంజనేయులు గారు, మహేష్ గారు, ప్రసాద్ గారు, మల్లేష్ గారు మరియు అనేకమంది ఇతర పెద్దలు పాల్గొని ఐలమ్మ తల్లిని స్మరించుకున్నారు.ఈ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు స్థానిక ప్రజలు సునీతమ్మ గారికి కృతజ్ఞతలు తెలిపారు.