కల్లూరు మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లదే పైచేయి
Fri, Jan 02, 2026, 12:26 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 10:28 AM
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ . జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం నా తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాల్లో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు