టోలిచౌకి కేసు: .30 వేలకు మైనర్ అప్పగింత ఆరోపణ. మైనర్ అక్రమ రవాణా 8 మంది అరెస్ట్ #latestnews #news

Select Suryaa Now
టోలిచౌకి కేసు: .30 వేలకు మైనర్ అప్పగింత ఆరోపణ. మైనర్ అక్రమ రవాణా 8 మంది అరెస్ట్ #latestnews #news హైదరాబాద్‌లో మైనర్ బాలిక అక్రమ రవాణా కేసులో టోలిచౌకి పోలీసులు 24 గంటల్లోనే 8 మందిని అరెస్ట్ చేశారు. పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం, ఆశ్రయం కల్పిస్తామని నమ్మించి బాలికను అప్పగించినట్లు, ఇందుకు రూ.30 వేల చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 5న తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఆటో, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.