videos
చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా మలయప్ప స్వామి.. తిరుమలలో వైభవం
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్ప స్వామి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ తిరుమల మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా సాగింది. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20 వరకు జరుగుతాయి. సాయంత్రం హంస వాహనసేవ ఉంటుంది.