స్వామి పుష్కరిణి: సర్వతీర్థాల సంగమం #tirumala

Select Suryaa Now
Swami Pushkarini, the sacred temple tank beside the Sri Venkateswara Swamy Temple in Tirumala, is believed to be the confluence of all holy tirthas. In this video, discover its Puranic significance, history, the tirthas around it, and the tradition of Pushkarini Harati. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న స్వామి పుష్కరిణి సర్వతీర్థాల సంగమంగా పేర్కొనబడింది. ఈ వీడియోలో పుష్కరిణి పౌరాణిక ప్రాశస్త్యం, చరిత్ర, చుట్టూ ఉన్న తీర్థాలు, స్నాన మహిమ గురించి తెలుసుకోండి.' స్వామి పుష్కరిణి: సర్వతీర్థాల సంగమం, సకల అభీష్టాల ప్రదాయిని తిరుమల, అక్టోబర్ 4: శ్రీమహావిష్ణువు పాదాల నుంచి ఉద్భవించి, బ్రహ్మదేవుని స్పర్శతో పవిత్రమై, సనక సనందనాది యోగులు కీర్తించిన పావన తీర్థం తిరుమల శ్రీవారి స్వామి పుష్కరిణి. దక్షిణ భారతానికి మకుటాయమానమైన తిరుమల క్షేత్రంలో సర్వకామప్రదాయకమైన అరవై ఆరు కోట్ల తీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం చెబుతోంది. వాటిలో శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న మహాతీర్థమే స్వామి పుష్కరిణి. వేంకటాచలంలోని తీర్థాలన్నింటికీ ఇది అవతార స్థానమని పురాణాలు పేర్కొంటున్నాయి.