BREAKING
నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ వీరవిహారం: 60 ఏళ్ల రికార్డు బ్రేక్, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జోరు! విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ అమరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సైబరాబాద్ సీపీ డా. యం. రమేష్ బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం గరివిడి లక్ష్మి చిత్రంలో సత్తిబాబుగా రాగ్ మయూర్ అద్భుత నటన: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మేకోవర్! 32వ డివిజన్ కూటమి అభ్యర్థిగా కౌసర్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు కూటమి అభ్యర్థి ఉమామహేశ్వరి విజయానికి కరాటం రాంబాబు, శేషు ప్రచారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.... ఘనంగా శమీ పూజ, రావణ దహనం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమణ 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు: 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్ పాతబస్తీలో బతుకమ్మ నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేక మహిళలకు ఇబ్బందులు పోలీసులు ఫ్లాగ్ మార్చ్

సీనియర్ సిటిజెన్స్ దసరా సమ్మేళనం

Select Suryaa Now
సీనియర్ సిటిజెన్స్ దసరా సమ్మేళనం
సూర్య జగిత్యాల ప్రతినిధి ;తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం, ఆలయ్ బలయ్ కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం అసోసియేషన్ కా ర్యాలయంలో జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో బతుకమ్మ పోటీల్లో,దసరా క్రీడల్లో విజేతలకు మాజీ మున్సిపల్ చైర్మన్ జీ ఆర్ దేశాయ్, రిటైర్డ్ జిల్లా అటవీ శాఖాధికారి పూసాల అశోక్ రావు చేతులమీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం మత సామరస్యానికి కృషి చేస్తున్న ఆరుగురు సీనియర్ సిటిజెన్లను సన్మానించారు.జమ్మి ఆకులు పంచుకుంటూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్, భాయ్ అంటూ ఆలయ్, బలయ్ చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి లో సర్వమత సమ్మేళనం భావనతో అందరం ఒక్కటే అనే సందేశం సీనియర్ సిటిజెన్స్ తరపున తెలుపడానికి రాష్ట్ర అధ్యక్షులు పోతు నర్సింహా రావు సూచనలతో దసరా పండుగ సందర్బంగా ఆలయ్, బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాతం, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. సి. హన్మంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, అశోక్ రావు, ఎం. డి. యాకూబ్,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,కోరుట్ల అధ్యక్షులు పబ్బా శివానందం, మెట్ పల్లి అధ్యక్షులు వొజ్జల బుచ్చి రెడ్డి, జగిత్యాల డివిజన్ అధ్యక్షులు బి. రాజేశ్వర్, కార్యదర్శి రాజ్ గోపాల్ చారి,ధర్మపురి నియోజకవర్గం అధ్యక్షులు కండ్ల గంగాధర్, బుగ్గారం అధ్యక్షులు దుబ్బేశం, మల్యాల అధ్యక్షులు ఎం. డి యాకుబ్, గొల్లపల్లి అధ్యక్షులు వీరారెడ్డి, జగిత్యాల పట్టణ అధ్యక్షులు మానాల కిషన్, కార్యదర్శి సింగం గంగాధర్, పుప్పాల నర్సింగారావు, సింగం భాస్కర్, డేవిడ్,కరుణ,జలజ,విజయలక్ష్మి,సింగం పద్మ,జిల్లా, డివిజన్ల, మండలాల, గ్రామాల సీనియర్ సిటిజెన్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.