telangana
ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు అందజేత
సూర్య,లింగంపేట్;లింగంపేట్ మండలంలోని పర్మల్ల గ్రామానికి చెందిన ఇర్ల సిద్దయ్యకు మంజూరైన 32,000/-రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు బాధితునికి అందజేశారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు,లింగంపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్ సూచనలతో బాధితునికి చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కొడబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.ఎమ్మెల్యే సహకారంతో అర్హులందరికీ సంక్షేమ పథకాలు త్వరితగతిన అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం బాబాయి నరేష్,ఉప సర్పంచ్ కొడబోయిన శ్రీను,డైరెక్టర్ కొడబోయిన సాయికుమార్,గంట బాబు,చాకలి రవి,ఇర్ల సాయిలు,రవి గౌడ్,కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.