శ్రీధర్‌బాబు ఫైర్.. స్పీకర్‌ను బెదిరిస్తున్నారు
హరీష్‌రావుపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు
స్పీకర్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. సభను ఎలా నడపాలనే అంశంపై హరీష్‌రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
“స్పీకర్ ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అని చెప్పడానికి వాళ్లెవరు?” అని ప్రశ్నించారు. అనుకుంటే, భావిస్తే ఏంటి.. జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోల్లో అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.
మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై నివేదిక ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారని తెలిపారు. అయితే స్పీకర్‌పై జరిగిన ఘటనను మాత్రం పక్కన పెట్టాలని కోరుతున్నారని శ్రీధర్‌బాబు విమర్శించారు.