BREAKING
స్పీకర్ ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదు స్పీకర్ ఆత్మగౌరవంపై దాడి చేస్తే సహించేది లేదు హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల సందడి: శాంతిభద్రతలపై పోలీసుల కీలక నిర్ణయాలు! బాక్సాఫీస్ వద్ద ‘మిర్జాపూర్: ది మూవీ’ సునామీ: 100 కోట్ల క్లబ్‌లో అడుగు! చరణ్-సుకుమార్ ‘RC17’ అప్డేట్: లాకైన కథ.. ఫైనల్ నెరేషన్‌కు సిద్ధం! బాక్సాఫీస్ వద్ద సూర్య సరికొత్త రికార్డు.. 25 రోజుల్లో 260 కోట్ల వసూళ్లతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రభంజనం జర్నలిస్టుల పిల్లల ఫీజులపై జాప్యం.. ఇక సహించం!… తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి.. లేదంటే దశలవారీ ఉద్యమం… పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్… నా కెరీర్‌లో అత్యంత కీలకం ‘సర్దార్‌ 2’: హీరో కార్తీ! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు: నేటి మార్కెట్ వివరాలు! తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు: స్వల్ప తగ్గుదల నమోదు! శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ ఆత్మగౌరవంపై దాడి చేస్తే సహించేది లేదు

Select Suryaa Now
స్పీకర్ ఆత్మగౌరవంపై దాడి చేస్తే సహించేది లేదు

 

తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలి

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్

మోమిన్‌పేట్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 8): తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ తాత మధు చేసిన అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మోమిన్‌పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్ అన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ రాజకీయ విమర్శలు హద్దుల్లో ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించారు.తాత మధుపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మన్నె శంకర్ యాదవ్ స్పష్టం చేశారు.