BREAKING
మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ ఢిల్లీలో భవనాల భద్రత, పీజీ నిబంధనలపై ఎల్జీ తరంజిత్ సింగ్ సంధు సమీక్ష

లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్

Select Suryaa Now
లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్


 

 
 
 
 
 
 
 
ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ హుజురాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్లను ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాలలోకి వెళితే... హుజురాబాద్ సబ్ జైలు డిప్యూటి జైలర్ నాంపల్లి దేవేందర్ (46) జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామకు మెరుగైన వసతులు కల్పించడం, ములాఖత్‌లకు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసేందుకు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. కాగా బాధితుడు ఈ విషయాన్ని ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు.
​ఈ క్రమంలో ఏసిబి డిఎస్పి గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం  సాయంత్రం సుమారు 5:45 గంటల సమయంలో, ఇండియన్ ఆయిల్ సబ్ జైల్ పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ (30) ద్వారా డిప్యూటీ జైలర్ దేవేందర్ రూ. 10,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పెట్రోల్ బంక్ ఆపరేటర్ వద్ద నుంచి రసాయన పరీక్షల అనంతరం నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డిప్యూటి జైలర్ దేవేందర్, బంక్ ఆపరేటర్ హరీశ్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కరీంనగర్ ఏసిబి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.