BREAKING
మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ ఢిల్లీలో భవనాల భద్రత, పీజీ నిబంధనలపై ఎల్జీ తరంజిత్ సింగ్ సంధు సమీక్ష

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ

Select Suryaa Now
ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో జరిగిన సమావేశం ఎలాంటి తుది నిర్ణయం లేకుండానే ముగిసింది. కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి.

అజెండా లేకుండానే సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరైనట్లు సమాచారం.

తెలంగాణలోని 30–50 ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం తెలిపింది.

శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ డిమాండ్ చేసింది.

గోదావరి బేసిన్‌లో నీటి లభ్యతను సమగ్రంగా లెక్కించాలని ఏపీ కోరింది.

ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాల ఆధారంగా CWC తదుపరి సమావేశానికి అజెండాను ఖరారు చేయనుంది.

మరో 10–15 రోజుల్లో ఇరు రాష్ట్రాల అధికారులతో మరోసారి CWC సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

 

మొత్తానికి.. ఢిల్లీలో జరిగిన చర్చల్లో తెలుగు రాష్ట్రాల జల వివాదాలకు పరిష్కారం లభించలేదు. వచ్చే సమావేశంలో కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.