ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ
అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఈ నెల 23, 24 తేదీలతో MPP, ZPPల ప్రస్తుత పదవీకాలం ముగియనుంది. దీంతో త్వరలోనే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కసరత్తు చేయనుంది.
కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ పూర్తయిన నేపథ్యంలో, ఆయా పరిధులకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నట్లు SEC వెల్లడించింది.