యూట్యూబర్ నందన అరెస్ట్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురి వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై నందన దంపతులపై గతంలోనే పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న నందనను, ఆమెపై లుక్ ఔట్ నోటీసులు అమలులో ఉండటంతో విమానాశ్రయ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ కేసు విచారణ నిమిత్తం ఆమెను ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.