శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు
సూర్య వేములవాడ రురల్:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నుంచి సుమారు 8:50 వరకు 1,05,600 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ప్రజాసంబంధాల అధికారి (పీఆర్ఓ) శ్రీనివాస్ తెలిపారు.
భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు పీఆర్ఓ పెరిక శ్రీనివాస్ వెల్లడించారు.