BREAKING
కార్యకర్తల సంక్షేమానికి జగనన్న పెద్దపీట - కార్యకర్తల కుటుంబాలకు రు. 5 లక్షల సాయంపై హర్షం - వైసీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి కనకరాజు నాగార్జున కింగ్ 100 సినిమాలో విలన్‌గా ప్రముఖ తమిళ నటుడు.. ట్రెండింగ్‌లో క్రేజీ న్యూస్ ప్రొద్దుటూరు మున్సిపల్ ఆస్తులకు రక్షణ కల్పిస్తూ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టండి పాల ట్యాంకర్ కు అంటుకున్న మంటలు ఓటీటీలోకి రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్.. స్ట్రీమింగ్‌పై మరింత ఆలస్యం? వెంకన్న సన్నిధిలో ఐఏఎస్ నవ్య ఒగ్గుకళాకారుల నూతన కమిటీ ఎన్నిక… అధ్యక్షుడిగా జెనిగె కొండల్ తాగునీటి పైపులైన్ లీకేజ్ కి చర్యలు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల హీట్.. ఈ వారం ఎలిమినేషన్‌కు ఏడుగురు సభ్యులు డేంజర్ జోన్‌లో అదనపు గదులు మంజూరు చేయండి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ -రూ.11,085 కోట్లతో గ్రామ స్వరాజ్యానికి శంకుస్థాపన -గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తున్న ఘనత కూటమిదే -హర్షం వ్యక్తం చేసిన గ్రంథాలయ చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి *జలసిరి కార్యక్రమంలో ఫామ్ పాండ్ పనులు ప్రారంభం* ఆర్ఎంపీల గుర్తింపుకై ప్రభుత్వం చొరవ చూపాలి - నిర్మల్ జిల్లా బాధ్యులు ఆశమొల్ల మోహన్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన అధికారులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

Select Suryaa Now
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రేపు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

 

• సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

సూర్య, రామకృష్ణాపూర్ :ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఎన్నికల సంఘంలోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు కీలక నిర్ణయాలపై రికార్డులో అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. బుధవారం రోజున ఎఐటియుసి యూనియన్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ బద్ధ సంస్థ అయినా ఎన్నికల సంఘంలో కలోహాలు రావడం దేశ ప్రజలకు  ఎదురవుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలన్నారు. ఎన్నికల మీద ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల డేటా నిర్వహణ వంటి కీలక అంశాలపై  సీఈసీ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, ఎన్నికల సంఘంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఐ పట్టణ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి శ్రీనివాస్, సిపిఐ మండల కార్యదర్శి, వనం సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు,కాదండి సాంబయ్య, మామిడి గోపి, ఎగుడ మొండి, నక్క వెంకటస్వామి, పార్టీ ప్రజాసంఘాల నాయకులు మండల శ్రీనివాస్,కారుకురి రాయలింగు,యండి హుస్సేన్, గజ్జి రమేష్,తదితరులు పాల్గొన్నారు.