BREAKING
ఏలూరి మాధవరావు ఉచిత వాటర్‌ క్యాన్లు పంపిణీ గుంటూరు మేయర్ రేస్‌లో మాదాల చైతన్య వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్* *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ గొట్టిపాటి లక్ష్మీ కృషి తో తొలగిన తాగునీరు ఇబ్బందులు. ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ  శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్న బట్లచందారం రైతులు డీఏపీ సంచిలో రాళ్లు.. ఇసుక రైతు నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం అధికారులారా.. మా బాధను అర్థం చేసుకోండి రైతుల ఆవేదన.. ప్రతి ఇంటా.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వల్లూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తహసీల్దార్ శ్రీవాణి.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది భారత్-కజకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు టోకాయెవ్ సమీక్ష హిందీ దివస్ 2026

పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్న బట్లచందారం రైతులు

Select Suryaa Now
పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్న బట్లచందారం రైతులు

 

భూములు ఇస్తామని ఎప్పుడు చెప్పామో నిరూపించాలి
నిండు అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటు
ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని స్పష్టం

దోమ, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 13):వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచందారం గ్రామానికి చెందిన రైతులు పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమ మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మూడు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.తాము భూములు ఇస్తామని ఎక్కడ, ఎప్పుడు చెప్పామో ఎమ్మెల్యే నిరూపించాలని రైతులు సవాల్ చేశారు. నిండు అసెంబ్లీలో తమ భూముల విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తమ జీవనాధారం వ్యవసాయ భూములేనని, ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇచ్చేందుకు తాము అంగీకరించలేదని స్పష్టం చేశారు.ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తేల్చిచెప్పారు. అవసరమైతే ప్రాణాలు పోయినా సరే భూములను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇప్పటికైనా తమ భూముల విషయంలో అసత్య ప్రచారాలు మానుకుని వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని రైతులు డిమాండ్ చేశారు.