BREAKING
ప్రతి ఇంటా.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వల్లూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తహసీల్దార్ శ్రీవాణి.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది భారత్-కజకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు టోకాయెవ్ సమీక్ష హిందీ దివస్ 2026 ఏ సంక్షోభమూ ఒక ప్రాంతానికే పరిమితం కాదు ఐఎన్ఎస్ కులిష్‌కి కంబోడియాలో ఘన స్వాగతం తుంపర్తిలో ఘనంగా శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు.. ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు ఈనెల 21లోగా మద్యం దుకాణాల రెన్యూవల్ రుసుము చెల్లించాలి: ఎక్సైజ్ CI చంద్రమణి సెప్టెంబర్ 18న 'పిఠాపురంలో అలా మొదలైంది' విడుదల.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక ప్రజలందరికి.. వినాయక చవితి శుభాకాంక్షలు గణనాథుని కరుణతో ప్రజలకు సుఖసంతోషాలు ఎస్సై సూర్యనారాయణరెడ్డి.. బుడమేరు ఆక్రమణలపై ప్రభుత్వానికి ఊరట సైమా అవార్డ్స్ 2026: తెలుగు చిత్రసీమలో మెరిసిన తారలు.. సత్తా చాటిన 'సంక్రాంతికి వస్తున్నాం', 'మిరాయ్' సత్య సాయి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరువు చెట్లు పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ నందిపాడు కాలనీ సమీపంలో గుర్తు తెలియని శవం కలకలం: పంచాయతీ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా.. ‘యాలాలో యాలాలో’ వీడియో సాంగ్ విడుదల

మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం .... ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి & మాజీ కార్పొరేటర్ బన్నాల గీత

Select Suryaa Now
మట్టి వినాయకులను  పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం .... ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి & మాజీ కార్పొరేటర్ బన్నాల గీత

 

బీరప్ప గడ్డ డివిజన్లోని కళ్యాణపురి కాలనీ, రాఘవేందర్ నగర్ కాలనీ మరియు ఈస్ట్ కళ్యాణపురిలో కాలనీల అసోసియేషన్ ల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ....

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్

 చిల్కానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కళ్యాణ్పురి రాఘవేందర్ నగర్ కాలనీ, ఈస్ట్ కళ్యాణపురి మరియు సాయిరాం నగర్  కాలనీల అసోసియేషన్లు ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో కాలనీ సభ్యులకు మట్టి వినాయకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని అన్నారు 
 పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈనాడు పర్యావరణాన్ని మనము కాపాడితే పర్యావరణం మన భావి తరాలను  కాపాడుతుందని అన్నారు.

గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకాన్ని తగ్గించాలన్న ఒక గొప్ప సంకల్పంతో మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జిహెచ్ఎంసి ద్వారా మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా జిహెచ్ఎంసి 150 డివిజన్లో డివిజన్ కి సుమారు 5000 మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేదని గుర్తు చేశారు.

ముఖ్యంగా యువత, మహిళలు, గణేష్ ఉత్సవ కమిటీలు, కాలనీ సంక్షేమ సంఘాలు పర్యావరణహిత గణేష్ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. 
కార్యక్రమంలో కళ్యాణ్పురి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వికాస్, GS  గణేష్, మాధవి, శ్వేత, స్వప్న, ఏఎస్ఎన్ మూర్తి,శంకర్, ప్రదీప్, మరియు వారి కమిటీ సభ్యులు రాఘవేంద్ర నగర్ కాలనీ అధ్యక్షులు టి జి గౌడ్ , మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, రాజేశం, అదేవిధంగా ఈస్ట్ కళ్యాణపురి సభ్యులు రాజశేఖర్, సీనియర్ సిటిజన్స్ సభ్యులు ముకుంద రావు , బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ రాజ్ కుమార్, కొండల్ రెడ్డి, కొక్కొండ జగన్ బాలకృష్ణ గౌడ్, శ్యామ్,అదేవిధంగా కాలనీ సభ్యులు పెద్ద ఎత్తున మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.l