BREAKING
బుడమేరు ఆక్రమణలపై ప్రభుత్వానికి ఊరట సైమా అవార్డ్స్ 2026: తెలుగు చిత్రసీమలో మెరిసిన తారలు.. సత్తా చాటిన 'సంక్రాంతికి వస్తున్నాం', 'మిరాయ్' సత్య సాయి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరువు చెట్లు పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ నందిపాడు కాలనీ సమీపంలో గుర్తు తెలియని శవం కలకలం: పంచాయతీ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా.. ‘యాలాలో యాలాలో’ వీడియో సాంగ్ విడుదల వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధం చేసిన సైబరాబాద్ పోలీసులు.. పటిష్ట భద్రతతో పాటు విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి ముగిసిన బ్రిక్స్ సదస్సు.. స్వదేశాలకు పయనమైన వివిధ దేశాల అధినేతలు మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం .... ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి & మాజీ కార్పొరేటర్ బన్నాల గీత నాగోల్‌లో అంబరాన్ని అంటుతున్న గణేష్ ఉత్సవాలు.. 72 అడుగుల భారీ మట్టి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ తిరుమల వాహనాల అనుమతిపై వస్తున్న వార్తలు అవాస్తవం: టీటీడీ స్పష్టత ఎల్బీనగర్‌లో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అధికారుల చర్యలు ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేష్ మండపాలను సందర్శించిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ గాంధీ ఆస్పత్రి వైద్యుల అరుదైన ప్రతిభ.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం బిగ్ బాస్ హౌస్‌లో దేబ్జానీ మనసులోని మాట.. ముఖేష్‌పై ప్రత్యేక ఇష్టం సిల్క్ సిటీ... గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత సిటీగా ఉండాలి* *పట్టణ ప్రజలకు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు*

శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి… సీపీ గౌష్ ఆలం

Select Suryaa Now
శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి…   సీపీ గౌష్ ఆలం
సూర్య కరీంనగర్ ప్రతినిధి :
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కరీంనగర్ కమిషనరేట్‌ పరిధిలో పటిష్ట బందోబస్తు, భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాలంటీర్లు అందుబాటులో ఉండి పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రధాన నిమజ్జన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు, విద్యుత్ దీపాలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్ మ్యాప్ అమలు చేస్తున్నామని, అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలను తొలగించినట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినా, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియాలో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రి వేడుకలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించాలని సీపీ కోరారు.