పామెనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి
స్థానిక కౌన్సిలర్ దావల్ గారి గోపాల్ రెడ్డి
చేవెళ్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 13): చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు పామేనలో కౌన్సిలర్ దావల్ గారి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ రాము గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తామని కౌన్సిలర్ దావల్ గారి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఫరిన్ ఖదీర్ పాషా, మండల కార్యదర్శి టేకులపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.