జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోండి: ఖాజీపేట సీఐ వంశీధర్
వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని, మండపాలకు అనుమతులు తప్పనిసరి అని, డీజేలకు అనుమతి లేదని ఖాజీపేట సీఐ వంశీధర్ సూచించారు.వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఖాజీపేట పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వంశీధర్ ప్రజలకు సూచించారు. ఖాజీపేట మండల ప్రజలకు ఆయన ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖాజీపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని సీఐ సూచించారు. విగ్రహాలను ఏర్పాటు చేసుకునే ముందు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాలని తెలిపారు.వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రాంగణం వల్ల స్థానిక ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.