26న సత్యసాయి జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
పుట్టపర్తి:
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి గ్రామంలో సెప్టెంబర్ 26న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సర్క్యులర్ జారీ అయింది. ఈ పర్యటనలో భాగంగా తాడిమర్రి PHCలో 'ఇ-సంజీవని' కార్యక్రమం ప్రారంభం కానున్నందున, అక్కడి వైద్యులు మరియు సిబ్బంది వైద్య సేవలు, హెల్త్ ఇండికేటర్స్ 95 శాతానికి పైగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే IVRS పాజిటివ్ రెస్పాన్స్ 90 శాతానికి తక్కువ కాకుండా పర్యవేక్షించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రికార్డులు, పోర్టల్ డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు.
పుట్టపర్తి: సత్యసాయి జిల్లాలో సెప్టెంబర్ 26న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టరేట్/వైద్యశాఖ అప్రమత్తత జారీ చేసింది. జిల్లాలోని అన్ని PHCలు, ఆరోగ్య కేంద్రాల్లో FRS హాజరు 100 శాతం ఉండేలా చూడాలని, వైద్యులు, సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా సిబ్బంది విధులకు గైర్హాజరు కావడానికి వీల్లేదని, హెల్త్ ఇండికేటర్స్, IVRS పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆ సర్క్యులర్‌లో ఆదేశించారు.