విద్యా విజయాలకు మార్గదర్శి.. కదిరి బాబు రంగారావు
విద్యా విజయాలకు మార్గదర్శి.. కదిరి బాబు రంగారావు
పామూరు, మేజర్ న్యూస్ :
అక్షర విద్యాసంస్థల కరస్పాండెంట్ కదిరి బాబు రంగారావు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పువ్వాడి రాధాకృష్ణ కళ్యాణ మండపంలో అక్షర డిగ్రీ కళాశాల ప్రెసర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డిగ్రీ ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, గౌతమి విద్యాసంస్థల అధినేత గుండారెడ్డి హాజరై విద్యార్థులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా గుండారెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అక్షర విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న కదిరి బాబు రంగారావును అభినందించారు. అక్షర విద్యాసంస్థలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నాయన్నారు. బుల్లెట్ కంటే గొప్పది చదువు అని, విద్యే విద్యార్థుల భవిష్యత్తుకు గొప్ప ఆయుధమని పేర్కొన్నారు. విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అక్షర విద్యాసంస్థల కరస్పాండెంట్ కదిరి బాబు రంగారావు, శ్రీ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత పెద్దిరాజు కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.