దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం
దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం
అభివృద్ధి సంక్షేమానికి కేరాఫ్ టిడిపినే.
గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం పెద్ద పీట.
డైవర్ట్ పాలిటిక్స్, అసత్యాలు ప్రచారం చేయడమే గొడ్డలి పార్టీ ధ్యేయం.
శంకరాపురానికే మణిహారం కానున్న చెరువు.
చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
ముండ్లమూరు మేజర్ న్యూస్. రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన మెరుగుగా ఉందని, ప్రగతి పరిగెడుతుందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసి ప్రజలకు అందిస్తుందని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.
శంకరాపురం గ్రామం లో 50 లక్షల రూపాయలతో జరుగుతున్న చెరువు కట్ట నిర్మాణ పనులను గొట్టిపాటి లక్ష్మీ టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఒకవైపు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తూ అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నాడని ఆమె అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. డైవర్ట్ పాలిటిక్స్, అసత్యాల ను ప్రచారం చేయడమే గొడ్డలి పార్టీ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు . గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఏమీ లేదన్నారు. జగన్ పాలనలో దోచుకోవడం దాచుకోవడం సిద్ధాంతంగా పనిచేశారన్నారు. చెరువు అభివృద్ధి పనులను పరిశీలించి వివరాలను అధికారులను అడిగి డాక్టర్ లక్ష్మీ తెలుసుకున్నారు. చెరువు అభివృద్ధిలో భాగంగా చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ , లైటింగ్ ,ఆర్ సి సి బెంచీలు ,పార్కు, ఓపెన్ జిమ్, కట్టకు రీవట్మెంటు, తదితర పనులను చేయనున్నారు. ఈ కార్యక్రమంలోమండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రామయ్య, తాజా మాజీ సర్పంచ్ నారాయణ స్వామి, ఏఈ సుధాకర్ ఏపిడి చంద్రశేఖర్ రెడ్డి,
స్థానిక నాయకులు పాల్గొన్నారు.