కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం
కిష్టాపూర్‌లో బ్రీజా కారు బీభత్సం
మూడు వాహనాలు ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
మేడ్చల్ మేజర్ న్యూస్ ( సెప్టెంబర్ 12): మద్యం మత్తులో ఉన్న ఓ కారు యజమాని నిర్లక్ష్యంగా వాహనం నడిపి మూడు వాహనాలను ఢీకొట్టిన ఘటన కిష్టాపూర్‌లో చోటుచేసుకుంది. మసీద్‌పూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న బ్రీజా కారు యజమాని ధీరత్ సింగ్ మద్యం మత్తులో కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.