తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని వెంటనే నిర్మించాలి -కడెం లింగయ్య
తిరుమలగిరి :- తిరుమలగిరి. మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనం నిర్మానాన్ని వెంటనే నిర్మించాలని జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య డిమాండ్ చేశారు. 1987 1988 లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ తిరుమలగిరిలో నిర్మించాలని రైతుల నుండి కొంత భూమి విరాళంగా తీసుకొని జూనియర్ కాలేజీ యజమాన్యానికి రిజిస్ట్రేషన్ చేశారని, 1988లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి సంతోష్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి కాలేజీ స్థలంలో శంకుస్థాపన చేశారని అన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మించకపోవడం వల్ల అట్టి భూమి అన్యాక్రాంతమవుతున్నది
ఆ భూమిలోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మించాలని పిల్లల విద్యా భవిష్యత్తుకు తోడ్పడాలని కోరారు.