టిఎంజెఎఫ్ మహాసభకు బయలుదేరిన తిరుమలగిరి జర్నలిస్టులు.
తిరుమలగిరి:- హైదరాబాద్‌లోని కోఠి బీసీసీఈ భవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర 3వ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు బయలుదేరారు. ఈ సందర్భంగా టిఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలపై పోరాడుతున్న జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నిరంతరం ఉద్యమిస్తూ పోరాటాలు సాగిస్తోందన్నారు.మండల అధ్యక్షుడు బాకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నిర్మాళ్ల బాలకృష్ణ,దర్శనం శేఖర్, జోసెఫ్ ఉన్నారు.