BREAKING
బొప్పారంతో దామన్నకు విడదీయరాని అనుబంధం ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తా.. బిఆర్ఎస్ సదస్సుకు వేదికైన భారత మండపం ప్రత్యేకతలు ఇవే! సూర్యాపేటకు సుభిక్షం.. వరుణ యాగం*..మార్కెట్ చైర్మన్ కొప్పుల యష్ 'టాక్సిక్' సినిమాపై ఊహించని పరిణామాలు.. వారానికే థియేటర్ల నుంచి తొలగింపు! రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్*.. సూర్యాపేట సిఐ ‘స్పిరిట్’ సినిమా తర్వాతే అసలు విజయం.. నిర్మాత సవాల్ హైదరాబాద్‌లో హైడ్రా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్.. 1070 ద్వారా ఫిర్యాదుల స్వీకరణ బ్రిక్స్ సమ్మిట్ వేదికగా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై దేశాల వ్యూహాత్మక మంతనాలు మాధురి రాథోడ్ కేసులో కీలక పరిణామం.. ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు! జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్.. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు! గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు ప్రకృతి హితమే పండుగల పరమార్థం.. మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వ్యవసాయ అధికారికి మట్టి వినాయకుని అందిస్తున్న దృశ్యం పాలిటిక్నిక్ లు ప్రైవేటు పరం కావు అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి

ప్రకృతి హితమే పండుగల పరమార్థం.. మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Select Suryaa Now
ప్రకృతి హితమే పండుగల పరమార్థం..  మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకృతి హితమే పండుగల పరమార్థం..

మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే 

పటాన్ చెరు. ; ప్రకృతి హితమే పండుగల పరమార్థమని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని  శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.శనివారం పటాన్చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ సర్కిల్‌లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే  ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంటుందని అన్నారు. ప్రకృతితో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులను ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సూచించారు.ప్రతి ఏటా బల్దియా ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సుమారు 600 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని, వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జరుపుకోవాలని ఎమ్మెల్యే  కోరారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నర్రా బిక్షపతి, పృథ్వీరాజ్, తదితరులు పాల్గొన్నారు.