వ్యవసాయ అధికారికి మట్టి వినాయకుని అందిస్తున్న దృశ్యం
మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణకు పిలుపు
ప్రతి భక్తుడికి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు
పులివెందుల, మేజర్ న్యూస్:
పర్యావరణ పరిరక్షణతో పాటు మట్టి సారాన్ని కాపాడే ఉద్దేశంతో పులివెందుల పట్టణంలోని ధరణి క్రాప్ కేర్ ఎరువుల దుకాణం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని నిర్వాహకులు పిలుపుని చ్చారు.మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించవచ్చని తెలిపారు. రసాయనాలతో తయారైన విగ్రహాల వల్ల నీటి వనరులకు కలిగే నష్టాన్ని నివారించేందుకు మట్టి వినాయకులనే ప్రోత్సహించాలని సూచించారు.
ధరణి క్రాప్ కేర్ ఎరువుల దుకాణానికి వచ్చే ప్రతి రైతు, భక్తుడికి మట్టి వినాయక విగ్రహాన్ని ఉచితంగా అందించను న్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంట్లో మట్టి వినాయకుడిని పూజించిన అనంతరం నిమజ్జనం రోజున ప్రత్యేకంగా బకెట్‌లో నీటితో విగ్రహాన్ని కరిగించి, అందులోని మట్టిని పొలాల్లో చల్లుకోవచ్చని పేర్కొన్నారు. తద్వారా వినాయకుడి మట్టిని వృథా చేయకుండా భూమికి ఉపయోగపడేలా చేసుకోవచ్చన్నారు.
“మట్టిలో పుట్టిన వినాయకుడు.. మట్టిలోనే కలవాలి. మన భూమి కోసం మన భవిష్యత్తు కోసం మట్టి వినాయకుడిని పూజిద్దాం అనే సందేశంతో పర్యావరణ హితమైన వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు.
ప్రకృతిని కాపాడటం, భూమిని సంపన్నంగా మార్చడం, రైతుకు సుస్థిరమైన సాగును అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని నిర్వాహకులు తెలిపారు. మట్టి వినాయకుడు మన భూమికి మేలని ఆది మన భవిష్యత్తుకు బాట అని పేర్కొన్నారు.
ఫోటో రైటప్
1. వ్యవసాయ అధికారికి మట్టి వినాయకుని అందిస్తున్న దృశ్యం