నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి
నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి
* కార్పొరేట్‌కి పోటీగా నెల్లూరు సర్కారీ బడులు
* పాఠశాలల పనులను పరిశీలించిన పొంగూరు షరణి
* సెప్టెంబర్ 16న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా పాఠశాలల ప్రారంభం
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ స్థాయి రూపురేఖలను సంతరించుకుంటున్నాయి...ములపేటలోని మరియు స్టోన్ హౌస్ పేటలోని ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి కుమార్తె పొంగూరు షరణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గతంలో విఆర్ స్కూల్‌ను ఏ విధంగానైతే కార్పొరేట్‌కు పోటీగా అభివృద్ధి చేశారో, తన తండ్రి గారు అప్పగించిన బాధ్యతతో ఈ రెండు పాఠశాలలను కూడా అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఆంబియన్స్ మరియు మోడరన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు.ప్రస్తుతం గ్రౌండ్ వర్క్స్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు..నెల్లూరులో చాలా మంది నిరుపేదలు ఉన్నారని, పేద పిల్లల బడుల్లో హాజరు శాతం చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేసిన షరణి.. పిల్లలు స్కూల్‌కి రావడానికి ఇష్టపడేలా మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడమే తమ ప్రధాన సంకల్పమని వెల్లడించారు. ఈ రెండు పాఠశాలల్లో ఆకౌస్టిక్ ప్యానెల్స్ ఉన్న హైటెక్ తరగతి గదులతో పాటు కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, కొత్త కాన్సెప్ట్‌తో ఆస్ట్రానమీ ల్యాబ్, అలాగే ఆర్ట్ రూమ్, మ్యూజిక్ రూమ్ మరియు యాక్టివిటీ రూమ్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు.పిల్లలు బాగా చదువుకుంటే నెల్లూరుతో పాటు మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుందనే గొప్ప లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కో పాఠశాలలో 1,000 మంది విద్యార్థుల సామర్థ్యంతో రీ-డిజైన్ చేస్తున్న ఈ రెండు స్కూళ్లను సెప్టెంబర్ 16వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు షరణి వెల్లడించారు.