BREAKING
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’ త్వరలోనే గ్లోబల్ ట్రేడ్‌కు ప్రధాన కేంద్రంగా భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం! DNHDD ను 'మినీ ఇండియా'గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కార్యనిర్వహణ  చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు వెండితెరపై సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సందడి.. రెండో అర్ధభాగంలో ట్విస్టులు అదుర్స్! నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి లక్ష్మీ క్వార్ట్జ్ కంపెని పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు - మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ - అబ్దుల్ అజీజ్‌ పై బురదజల్లితే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే - టీడీపీ మైనారిటీ నేతలు *అధిక ధరకు అమ్మిన వాటర్ బాటిలు..* *రూ.7 లక్షలు ఫైన్!* ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు బ్రిక్స్ సదస్సులో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ భారతదేశ తీరప్రాంతాన్ని పర్యావరణం, భద్రత, ఆర్థిక సమగ్ర ప్రదేశంగా చూడాలి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ‘నేతన్నల సేవలో’ పథకానికి ఆమోదం పోషక మాసం లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు

Select Suryaa Now
ఉద్యోగులకు గుడ్‌న్యూస్..  డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ  ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు

 

ఆరు డీఏలు త్వరలో ప్రకటిస్తామని హామీ

పీఆర్‌సీ నివేదికను వెంటనే అందేలా చర్యలు

ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తెలియజేసిన నేతలు

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
ఉద్యోగుల పక్షాన ఉంటానని సీఎం హామీ
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వ ఆహ్వానం మేరకు సీఎంను కలిసి తమ సమస్యలను వివరించారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న పని ఒత్తిడిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని వివరించారు. పీఆర్‌సీ కమిటీ నివేదిక ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను కూడా జేఏసీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ సంఘాల నాయకులపై పెరుగుతున్న ఒత్తిడి గురించి కూడా వివరించారు. సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం.. తాను ఎప్పుడూ ఉద్యోగుల పక్షానే ఉంటానని హామీ ఇచ్చినట్లు ‘తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌’ (టీఆర్‌ఈఎస్‌ఏ) రాష్ట్ర అధ్యక్షుడు కె. గౌతమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి రమణ్ రెడ్డి తెలిపారు. ఆరు డీఏలపై త్వరలోనే ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్లు వారు వెల్లడించారు. పీఆర్‌సీ కమిటీ నివేదిక కూడా వెంటనే తనకు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సీఎం సానుకూలంగా స్పందించి హామీలు ఇవ్వడంపై టీఆర్‌ఈఎస్‌ఏ రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని నేతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో టీఆర్‌ఈఎస్‌ఏ గౌరవాధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ఉన్నారు.