BREAKING
నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి లక్ష్మీ క్వార్ట్జ్ కంపెని పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు - మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ - అబ్దుల్ అజీజ్‌ పై బురదజల్లితే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే - టీడీపీ మైనారిటీ నేతలు *అధిక ధరకు అమ్మిన వాటర్ బాటిలు..* *రూ.7 లక్షలు ఫైన్!* ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు బ్రిక్స్ సదస్సులో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ భారతదేశ తీరప్రాంతాన్ని పర్యావరణం, భద్రత, ఆర్థిక సమగ్ర ప్రదేశంగా చూడాలి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ‘నేతన్నల సేవలో’ పథకానికి ఆమోదం పోషక మాసం లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తి.. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న చిత్రం! ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి మహబూబాబాద్ మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు పొందిన పోరిక అనిల్ కుమార్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

Select Suryaa Now
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

మాజీ మంత్రుల ధ్వజం
నాగర్ కర్నూలు: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, శ్రీశైలంలో సరిపడా నీరు ఉన్నప్పటికీ కల్వకుర్తి ద్వారా పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు.

పగటిపూట మోటార్లు నడిపి రాత్రి వేళల్లో విద్యుత్ నిలిపివేస్తుండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, ఒక్కో మోటారుతో కాలం వెళ్లదీస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఎత్తిపోతల మోటార్లకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను భారీగా పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

గత ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాల్వల నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళనపై ఉన్న శ్రద్ధ పాలమూరు సాగునీటిపై లేదని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే విద్యుత్ కోసం రైతులు రోడ్డెక్కడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కల్వకుర్తి మోటార్లను నిరంతరం నడపకపోతే రైతులతో కలిసి పంపింగ్ స్టేషన్ల వద్ద వంటావార్పు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.