BREAKING
నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి లక్ష్మీ క్వార్ట్జ్ కంపెని పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు - మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ - అబ్దుల్ అజీజ్‌ పై బురదజల్లితే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే - టీడీపీ మైనారిటీ నేతలు *అధిక ధరకు అమ్మిన వాటర్ బాటిలు..* *రూ.7 లక్షలు ఫైన్!* ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు బ్రిక్స్ సదస్సులో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ భారతదేశ తీరప్రాంతాన్ని పర్యావరణం, భద్రత, ఆర్థిక సమగ్ర ప్రదేశంగా చూడాలి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ‘నేతన్నల సేవలో’ పథకానికి ఆమోదం పోషక మాసం లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తి.. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న చిత్రం! ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి మహబూబాబాద్ మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు పొందిన పోరిక అనిల్ కుమార్

పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది

Select Suryaa Now
పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది

జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
నాగర్ కర్నూల్: పదోన్నతి పొందిన ప్రతీ అధికారి నిజాయితీ, క్రమశిక్షణతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు. పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐగా పదోన్నతి పొందిన ఎండి. ఖలీల్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ తన చేతుల మీదుగా ఖలీల్‌కు ఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్స్ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం ఉన్నత స్థానానికి ఎదగడం మాత్రమే కాదని, దాంతోపాటు బాధ్యతలు మరింత పెరుగుతాయని స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది క్రమశిక్షణ, సేవాభావంతో వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందేలా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఏవో కృష్ణయ్య మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.