BREAKING
నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి లక్ష్మీ క్వార్ట్జ్ కంపెని పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు - మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ - అబ్దుల్ అజీజ్‌ పై బురదజల్లితే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే - టీడీపీ మైనారిటీ నేతలు *అధిక ధరకు అమ్మిన వాటర్ బాటిలు..* *రూ.7 లక్షలు ఫైన్!* ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు బ్రిక్స్ సదస్సులో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ భారతదేశ తీరప్రాంతాన్ని పర్యావరణం, భద్రత, ఆర్థిక సమగ్ర ప్రదేశంగా చూడాలి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ‘నేతన్నల సేవలో’ పథకానికి ఆమోదం పోషక మాసం లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తి.. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న చిత్రం! ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి మహబూబాబాద్ మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు పొందిన పోరిక అనిల్ కుమార్

అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

Select Suryaa Now
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి

బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మూడూ వంశీకృష్ణ
నర్సంపేట: విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అవినీతి నిర్మూలన, నిజాయితీ మరియు పారదర్శక పాలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ మూడూ వంశీకృష్ణ మాట్లాడుతూ, విజిలెన్స్ అంటే కేవలం అవినీతిని అరికట్టడమే కాకుండా రోజువారీ జీవితంలో నైతిక విలువలను పాటించడమని పేర్కొన్నారు.

ప్రభుత్వ లేదా బ్యాంకింగ్ సేవల కోసం ఎవరూ అక్రమంగా డబ్బు ఇవ్వకూడదని, లంచం అడిగితే భయపడకుండా అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. పథకాలు, రుణాలు, సబ్సిడీల కోసం మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా అధికారిక మార్గాల ద్వారానే పొం దాలని అవగాహన పరిచారు. అవినీతిని చూసి మౌనంగా ఉండకుండా ప్రశ్నించడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు.

"నేను లంచం ఇవ్వను – తీసుకోను, అవినీతిని ప్రోత్సహించను" అనే సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే అవినీతి రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.