BREAKING
అర్జెంటీనాలో వింత దృశ్యం.. రాత్రికి రాత్రే కిలోమీటర్ల కొద్దీ వెనక్కి తగ్గిన సముద్రం.. బయటపడ్డ పురాతన రాతి నిర్మాణాలు భారత్ మండపంలో 37 భారతీయ డీప్-టెక్ స్టార్టప్‌ల ప్రదర్శన డిడి ఇండియా 'ది ఎకనామిక్ బ్రీఫ్' ఆచార్య వినోబా భావే 'జై జగత్' పిలుపు మానవత్వాన్ని ఉన్నతంగా నిలిపింది ఉమ్మడి పురోగతికి భారత్, ఇరాన్ కృషి: విదేశాంగ శాఖ ప్రకటన న్యూఢిల్లీకి చేరుకున్న నైజీరియా ఉపాధ్యక్షుడు కాశీమ్ షెట్టిమా థియేటర్లలోకి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’.. తొలి రివ్యూలు ఎలా ఉన్నాయంటే! ఢిల్లీకి చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ భారత్ మండపంలో బ్రిక్స్ భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్‌పోజిషన్ ప్రారంభం ఉరుగ్వే విదేశాంగ మంత్రితో ఎస్.జైశంకర్ భేటీ రష్యా ఉప ప్రధానితో నిర్మలా సీతారామన్ భేటీ టాలీవుడ్‌లోకి బాలీవుడ్ సంచలన చిత్రం.. తెలుగులో ‘హనుమాన్ అంశ్’ విడుదల తేదీ ఖరారు! భారతదేశంలో 80 లక్షల మార్కును దాటిన హెచ్‌పివి వ్యాక్సినేషన్లు బ్రెజిల్ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ భేటీ భారత్, రష్యాగ్రూప్ కీలక సమావేశం.. ఢిల్లీ వేదికగా మోదీ, పుతిన్ ఉన్నత స్థాయి చర్చలు

శ్రీ కృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ నిలిపివేయాలి

Select Suryaa Now
శ్రీ కృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ నిలిపివేయాలి

 

నంద్యాల అర్బన్, మేజర్ న్యూస్: నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ నందు ఈ నెల 13 వ తేదీన
శ్రీ కృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ బలిజసంఘం మరియు కాప్స్ రాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం సరైనది కాదని, అలా చేస్తే అడ్డుకుంటామని నంద్యాల యాదవ సంఘం నాయకులు హెచ్చరించారు. నంద్యాలలోని శ్రీ కృష్ణ దేవాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు యాదవ వంశస్తులని, వందల సంవత్సరాల నాటి చరిత్రలు చెబుతున్నాయన్నారు. ఈ విషయాన్ని బలిజ వంశస్థులు తప్పుదో పట్టిస్తూ నంద్యాలలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఒక కులానికి పరిమితం చేసేలా శిలాఫలకాలపై వారీ పేర్లు  ముద్రించి విగ్రహ ఆవిష్కరణ చేయడం చట్టపరంగా విరుద్ధమన్నారు. దీనిపై యాదవ సంఘం నంద్యాల కలెక్టర్, డిఆర్ఓ కార్యాలయాల్లో మరియు నంద్యాల మున్సిపల్ కమిషనర్, నంద్యాల ఏఎస్పీని కలిసి ఈ విగ్రహ ఆవిష్కరణ కు ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేయడము చట్ట పరంగా విరుద్ధమని  విన్నవించడం జరిగిందన్నారు. అలా కాకుండా విగ్రహావిష్కరణ జరపాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల యాదవ సంఘం సభ్యులు తరలి వచ్చి విగ్రహావిష్కరణ ముట్టడిస్తామని హెచ్చరించారు. చివరికి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల కైనా వెనుకాడమని,
ప్రభుత్వ ఏర్పాటుతో కార్యక్రమం చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. స్థానిక ఎన్నికలను నాయకులు, అధికారులు దృష్టిలో ఉంచుకుని 
యాదవ సమాజ మనోభావాలను దెబ్బ తీసే విధంగా,  చేయడం మంచి పద్ధతి కాదన్నారు.   నంద్యాలలో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొందరు నంద్యాల బలిజ సంఘం మరియు రాక్స్ కాప్స్ వారు  ప్రయత్నాలను  విరమించుకోవాలని నంద్యాల యాదవ సంఘం వారు తెలియ జేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహా సభ నంద్యాల జిల్లా అధ్యక్షులు పృథ్వి రాజ్ యాదవ్, నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ చెల్లా గోపాల్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బోధనం చంద్రశేఖర్ యాదవ్, నాలి విజయ శేఖర్ యాదవ్, బండారు నాగేశ్వరావు యాదవ్, జయ లక్ష్మి యాదవ్,
శ్రీనివాసరావు యాదవ్, కాజా శ్రీనివాస్ యాదవ్
మహేష్ యాదవ్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.