మంత్రిని కలిసిన చేనేత సంఘాల జేఏసీ బృందం
రాజధాని లోని తాడేపల్లి నందు చేనేత శాఖ మంత్రి ఎస్.సవిత నివాసంలో రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ప్రతినిధి బృందం కలసి వారితో జరిగిన చర్చలు అనంతరం మంత్రి దృష్టికి చేనేత కార్మికుల సమస్యల తీసుకెళ్లడంతో పాటు తక్షణం పరిష్కరించవలసిన సమస్యలతో పాటు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీలైనంత త్వరలో నేతన్న సేవ లో మిగిలి ఉన్న చేనేత కార్మికులకు నిధులు విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా నేత కార్మికులు పింఛన్ పొందేందుకు ఉన్న కఠిన నిబంధనలను తొలగించే అందరికీ న్యాయం చేస్తానని వీలైనంత త్వరలో మీరు నా దృష్టిలో పెట్టిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని మంత్రి కి అందజేయడం జరిగింది.1. నేతన్న సేవ పథకంలో మిగిలిపోయిన అర్హులైన చేనేతలందరకు నిధులు విడుదల చేసి తక్షణం 25 వేల రూపాయలు అందజేయాలని.2. రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన చేనేత కార్మికులందరికీ చేనేత పింఛన్ మంజూరు చేయాలని. పింఛన్ మంజూరుకు పెట్టిన అడ్డగోలు నిబంధన లను తక్షణం తొలగించి అర్హత కలిగిన వారందరికీ పింఛన్ మంజూరు చేయాలని ముఖ్యంగా చేనేత కార్మికులకులు మాస్టర్ వీవర్ వద్ద తన మజూరి బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా తీసుకున్నట్టు రుజువు పత్రాన్ని సమర్పించాలన్న నిబంధనను తక్షణం తొలగించాలని కోరడమైనది.3. రాష్ట్ర చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుండి రావలసిన 203 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని. చేనేత సహకార సంఘాలకు తక్షణం ఎన్నికల నిర్వహించేందుకు తద్వారా చేనేత కార్మికులకు ఉపాధిని పెంపొందించేందుకు చేనేత సంఘాలకు ఎన్నికలు జరప వలసిన బాధ్యత ప్రభుత్వం ఉందని ఆ మేరకు ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని. చేనేత పరిశ్రమపై ఉన్న వివిధ స్లాబుల జిఎస్టిని జీరో జీఎస్టీ గా మారుస్తామన్న ప్రభుత్వ హామీని అమల్లోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు . బండారు ఆనంద ప్రసాద్ పిల్లలమర్రి నాగేశ్వరావు . అండగుండ నారాయణ . కట్టా శివ దుర్గారావు పిల్లలమర్రి బాలకృష్ణ . రామనాథం పూర్ణచంద్రరావు . గద్దె హేమసుందర్రావు . మురుగుడు సత్యనారాయణ . గొట్టుముక్కల బాలాజీ డోకుపర్తి రామారావు తదితరులు పాల్గొనడం జరిగింది