వీరభధ్రీయ వీరముష్ఠి,విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు “విద్యా ప్రతిభ పురస్కారం–2026
తెలంగాణ వీరభద్రీయ (వీరముష్టి) సంఘం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యారంగంలో సాధించిన ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో “విద్యార్థిని, విద్యార్థులకు విద్యా ప్రతిభ పురస్కారం–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12, 2026న వీరభధ్రీయ వీరముష్ఠి సంఘం ముసరంబాగ్ లొ నిర్వహించబడనుంది. కార్యక్రమానికి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ . నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ CEO అలోక్ కుమార్వి విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు.
విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు సియచ్ కొండయ్య తెలిపారు.
ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, సంఘం నాయకులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కేంద్ర కమిటీ కోరింది.