పండుగను సామరస్యంతో సంతోషంగా జరుపుకోవాలి
ప్రచురణార్థం
మెదక్ 10 సెప్టెంబర్ 2026
పండుగను సామరస్యంతో సంతోషంగా జరుపుకోవాలి
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’’
జిల్లా అధికారులకు మట్టి వినాయక ప్రతిమలు అందించిన కలెక్టర్, ఎస్పీ
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ ; వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.గురువారం జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావు, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో బావయ్య లతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి వినాయక చవితి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు.జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలను నిర్వహించాలని తెలిపారు.జిల్లా అధికారులకు మట్టి వినాయక ప్రతిమలు అందించిన కలెక్టర్ ,ఎస్పీసమావేశం అనంతరం జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావు
గణపతి ప్రతిమలు అందించారుకలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, నదులు మరియు ఇతర జల వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా జల వనరుల పరిరక్షణకు తోడ్పడటంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ ,రెవిన్యూ గ్రామపంచాయతీ, వైజాగ్ శాఖ, విద్యుత్ , ఫైర్ , ఆర్ అండ్ బి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివిధ శాఖల అధికారులు, , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.