ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్
మెదక్ : సెప్టెంబర్ 17న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.వేదిక, ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన తాగునీటి సౌకర్యంతోపాటు ఇతర మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయ సిబ్బందితో కలిసి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ గౌరవ వందనం, బందోబస్తు విషయంలో పటిష్ట ఏర్పాట్లు. చేయాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, డిఎఫ్ఓ జోజి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.