BREAKING
నేటి విద్యార్థులే రేపటి ప్రజాస్వామ్యానికి వారసులు ఫిన్‌టెక్, ఆటోమేషన్ రంగానికి ఐర్లాండ్ వ్యూహాత్మక కేంద్రం మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ మణిపూర్ సీఎం ఖేమ్‌చంద్ యుమ్నంతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా 40% పైనే ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం ఊరట.. ఇకపై సులభంగా బ్యాంక్ ఖాతా మార్చుకునే అవకాశం ఒకే వ్యక్తికి రెండు మరణ ధృవీకరణ పత్రాల జారీ 'ఇడుపు కాయితం' సినిమా నుంచి 'శ్రీలత' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల భారీ మొత్తంలో బాండ్ల విక్రయానికి రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు.. రూ. లక్ష కోట్ల సేకరణే లక్ష్యం! ఢిల్లీ చేరుకున్న ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’ త్వరలోనే గ్లోబల్ ట్రేడ్‌కు ప్రధాన కేంద్రంగా భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం! DNHDD ను 'మినీ ఇండియా'గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం ఊరట.. ఇకపై సులభంగా బ్యాంక్ ఖాతా మార్చుకునే అవకాశం

Select Suryaa Now
ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం ఊరట.. ఇకపై సులభంగా బ్యాంక్ ఖాతా మార్చుకునే అవకాశం

సూర్యా న్యూస్ డెస్క్

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ వినియోగదారుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేయకుండానే 'వన్‌ట్యాగ్' ద్వారా సులభంగా వేరే బ్యాంక్ ఖాతాకు మార్చుకునే వెసులుబాటును కల్పించింది.

రోడ్డు ప్రయాణాలు చేసే వాహనదారులకు, ముఖ్యంగా ఫాస్టాగ్ వినియోగిస్తున్న వారికి ఇది ఉపశమనం కలిగించే వార్త. జాతీయ రహదారులపై టోల్ వసూళ్ల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఫాస్టాగ్ సేవలకు సంబంధించి వాహనదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు చెక్ పెడుతూ సరికొత్త పోర్టబిలిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు.

గతంలో వాహనదారులు తమ ఫాస్టాగ్ జతచేయబడిన బ్యాంక్ ఖాతాలో ఏవైనా సమస్యలు తలెత్తితే లేదా వేరే బ్యాంకుకు మారాలనుకుంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. పాత ట్యాగ్‌ను పూర్తిగా నిలిపివేసి (డీయాక్టివేట్ చేసి), ఆ తర్వాత సరికొత్త ట్యాగ్‌ను మరో బ్యాంకు ద్వారా కొనుగోలు చేసి అనుసంధానించాల్సి ఉండేది. ఈ తతంగం అంతా వాహనదారులకు ఎంతో కొంత శ్రమతో కూడుకున్నదిగా ఉండేది. అయితే ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా NHAI తాజాగా 'ఫాస్టాగ్ బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ' సదుపాయాన్ని అమల్లోకి తెచ్చింది.

ఈ కొత్త విధానం అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఇకపై తమ ఫాస్టాగ్ ట్యాగ్‌ను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేషనల్ హైవేస్ అథారిటీకి చెందిన అధికారిక 'రాజమార్గయాత్ర' (Rajmargyatra) మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి సులభంగా ఈ మార్పులు చేసుకోవచ్చు. ఈ యాప్‌లోని 'వన్‌ట్యాగ్' (OneTag) ఆప్షన్ ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను మార్చుకునే సౌలభ్యం కల్పించారు.

అంటే ఫాస్టాగ్ ట్యాగ్ మారకుండానే, కేవలం దానికి అనుసంధానమైన బ్యాంకు ఖాతాను మాత్రం వేరే దానికి మార్చుకోవచ్చన్నమాట. ఈ సదుపాయం రాకతో టోల్ ప్లాజాల వద్ద జరిగే లావాదేవీలు మరింత సులభం కావడంతో పాటు, వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ఎదుర్కొనే సాంకేతిక ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పు పట్ల వాహనదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.