BREAKING
నేర్చుకుంటూనే ఉందాం నేటి విద్యార్థులే రేపటి ప్రజాస్వామ్యానికి వారసులు ఫిన్‌టెక్, ఆటోమేషన్ రంగానికి ఐర్లాండ్ వ్యూహాత్మక కేంద్రం మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ మణిపూర్ సీఎం ఖేమ్‌చంద్ యుమ్నంతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా 40% పైనే ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం ఊరట.. ఇకపై సులభంగా బ్యాంక్ ఖాతా మార్చుకునే అవకాశం ఒకే వ్యక్తికి రెండు మరణ ధృవీకరణ పత్రాల జారీ 'ఇడుపు కాయితం' సినిమా నుంచి 'శ్రీలత' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల భారీ మొత్తంలో బాండ్ల విక్రయానికి రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు.. రూ. లక్ష కోట్ల సేకరణే లక్ష్యం! ఢిల్లీ చేరుకున్న ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’ త్వరలోనే గ్లోబల్ ట్రేడ్‌కు ప్రధాన కేంద్రంగా భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం!

ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా 40% పైనే

Select Suryaa Now
ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా 40% పైనే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలకు నమ్మదగిన వ్యాపార-వ్యాపార (B2B) సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యాలే వెన్నెముక అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన 'బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ 2026' సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బ్రిక్స్ దేశాల అగ్రనేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో లోతైన నిర్మాణాత్మక మార్పులు వస్తున్నాయని, పాత అగ్రగామి దేశాల స్థానంలో కొత్త చోదక శక్తులు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ దేశాల వాటా 40 శాతానికి పైగా నమోదవ్వగా, జి-7 (G7) దేశాల వాటా 29 శాతానికే పరిమితమైందని ఆయన గణాంకాలతో వివరించారు.

భారతదేశ అధ్యక్షతన "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" అనే నినాదంతో జరుగుతున్న ఈ 18వ బ్రిక్స్ సదస్సులో వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు గ్లోబల్ సౌత్ ప్రయోజనాల పరిరక్షణపై విసృత చర్చలు సాగుతున్నాయని నాయకులు స్పష్టం చేశారు.