BREAKING
పట్టుబడిన పిడిఎస్ బియ్యం డీసీఎం సీజ్ దుష్ప్రచారాలు నమ్మొద్దు గణేశ్ నిమజ్జనాలపై హైడ్రా చీఫ్ రంగనాథ్ గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి హైడ్రా వ్యతిరేకం కాదన్న రంగనాథ్ మండాడి మూవీ రివ్యూ: సూరి, సుహాస్ యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే? నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 1,871 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వ్యూహాత్మక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్ ఇ-కామర్స్ నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం అటవీ మదింపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. 'విత్తన గణపతి'ని పూజిద్దాం: విజయ్ దేవరకొండ పిలుపు బఖిరా సరస్సు అవక్షేపాల అధ్యయనం భారత్ మండపంలో ఘనంగా ఏర్పాట్లు పారిస్ అంతరిక్ష సదస్సు మూడు రోజుల పతనానికి బ్రేక్ బీహార్‌లో వరదల బీభత్సం రేపు బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె* సమ్మిళిత ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు

భారత్ మండపంలో ఘనంగా ఏర్పాట్లు

Select Suryaa Now
భారత్ మండపంలో ఘనంగా ఏర్పాట్లు

ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 12, 13 తేదీలలో రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ప్రతిష్టాత్మక BRICS శిఖరాగ్ర సదస్సు 2026కు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. "స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనుండగా, విదేశీ అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు.

ఈ అంతర్జాతీయ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్‌లతో పాటు బెలారస్, కజకిస్తాన్, మలేషియా, థాయ్‌లాండ్ ప్రభుత్వాధినేతలు విచ్చేస్తున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తుండగా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

గతంలో ఐదు దేశాలతో నడిచిన ఈ కూటమిలో 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, అలాగే 2025లో ఇండోనేషియా చేరడంతో ప్రస్తుతం 11 పూర్తిస్థాయి సభ్య దేశాల మహా కూటమిగా ఇది అవతరించింది. విదేశీ ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో భద్రత నిమిత్తం ఢిల్లీ పోలీసులు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విఐపి కాన్వాయ్‌ల కదలికలకు అనుగుణంగా ప్రయాణ మార్గాల్లో తాత్కాలిక మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తొలిరోజు సెప్టెంబర్ 12న "సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం" అంశంపై సభ్య దేశాల నేతలతో అంతర్గత సమావేశం జరగనుంది. అనంతరం 'భారత్ ఇన్నోవేట్స్' ప్రదర్శన వీక్షించి, ఉమ్మడి మొక్కల పెంపకం, అధికారిక విందులో పాల్గొంటారు. రెండో రోజు సెప్టెంబర్ 13న భాగస్వామ్య దేశాల నేతలతో కలిసి “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం” అనే అంశంపై విస్తృత స్థాయి ప్రధాన చర్చా సదస్సు కొనసాగనుంది.