BREAKING
సినిమా థియేటర్లలో 'ఇంటర్వెల్' వెనుక అసలు కారణం ఇదే! నేటి సమాజానికి వినాయక చవితి అందించే జీవన సందేశం ఇదే! ఆసియా కప్: సత్తా చాటుతున్న భారత జట్టు బ్యాటింగ్ విభాగాలు రూపాయికి భారీ ఎదురుదెబ్బ.. డాలర్‌తో మారకం విలువ 95.44కి పతనం అల్లు అర్జున్ ఫాన్స్ ఆధ్వర్యంలో హెచ్ పి వి అవగాహనకార్యక్రమం పట్టుబడిన పిడిఎస్ బియ్యం డీసీఎం సీజ్ దుష్ప్రచారాలు నమ్మొద్దు గణేశ్ నిమజ్జనాలపై హైడ్రా చీఫ్ రంగనాథ్ గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి హైడ్రా వ్యతిరేకం కాదన్న రంగనాథ్ మండాడి మూవీ రివ్యూ: సూరి, సుహాస్ యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే? నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 1,871 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వ్యూహాత్మక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్ ఇ-కామర్స్ నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం అటవీ మదింపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. 'విత్తన గణపతి'ని పూజిద్దాం: విజయ్ దేవరకొండ పిలుపు బఖిరా సరస్సు అవక్షేపాల అధ్యయనం భారత్ మండపంలో ఘనంగా ఏర్పాట్లు

పట్టుబడిన పిడిఎస్ బియ్యం డీసీఎం సీజ్

Select Suryaa Now
పట్టుబడిన పిడిఎస్ బియ్యం డీసీఎం సీజ్

పట్టుబడిన పిడిఎస్ బియ్యం డీసీఎం సీజ్

కొల్చారం …..పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న పిడిఎస్ బిఆర్ ని అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని కొల్చారం పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహీనుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కె ఏ-32-ఏ ఏ 4947 నెంబర్ గల డీసీఎం ఆఫీస్ తనిఖీ చేయగా ఫోర్టీ ఫైడ్ రైస్ కెర్నల్ (ఎఫ్ ఆర్ కె) తో కలిపి 290 బస్తాల పిడిఎస్ బియ్యం, మొత్తం 143.10 క్వింటాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనం డ్రైవర్ ముజీబ్ ను విచారించగా చంద్రయనగుట్ట ప్రాంతంలోని రేషన్ కార్డు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి, మెదక్ మీదుగా బోధన్ కు తరలించి అధిక ధరకు విక్రయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, డీసీఎం తనవేనని డ్రైవర్ చెప్పినట్లు తెలిపారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, తెలంగాణ స్టేట్ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ ఆర్డర్-2016 లోని క్లాజ్ 17(ఈ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించగా నర్సాపూర్ మండలం లింగాపూర్ లోని తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ లో భద్రపరచినట్లు తెలిపారు. డీసీఎం వాహనాన్ని తదుపరి ఆదేశాల మేరకు కొల్చారం పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు ఎస్సై మహమ్మద్ ముహిముద్దీన్ తెలిపారు.