అల్లు అర్జున్ ఫాన్స్ ఆధ్వర్యంలో హెచ్ పి వి అవగాహనకార్యక్రమం
భద్రాచలం ఆర్సీ (సూర్య మేజర్ న్యూస్ ):-భద్రాచలంలో గురుకుల పాఠశాలలో అల్లు అర్జున్ ఫాన్స్ ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హెచ్ పి వి వైరస్, వ్యాక్సిన్ ప్రాముఖ్యత, దాని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు వ్యాక్సిన్ ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించారు.. యుక్త వయస్సులోనే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో హెచ్ పి వి సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబం హెచ్ పి వి వ్యాక్సిన్ పై అవగాహన అవగాహన కలిగి ఉండాలని, డాక్టర్ల సలహా మేరకు పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫాన్స్ అధ్యక్షుడు చందు, వైస్ ప్రెసిడెంట్ రాకేష్, రాజేష్ రెడ్డి, చంటి తదితరులు పాల్గొన్నారు.