యూపీ తొలి ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్ జయంతి
నివాళులర్పించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో:ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, భారత రత్న పండిట్ గోవింద్ బల్లభ్ పంత్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ఆయనకు భావోద్వేగ నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంతో పాటు పరిపాలన, సామాజిక సంస్కరణలు మరియు భూ సంస్కరణలలో పంత్ అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదిగా, నాయకుడిగా పంత్ కీలక పాత్ర పోషించారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 1925 కాకోరి రైలు ఘటన కేకస్ లో విప్లవకారుల తరఫున ఆయన గట్టిగా వాదించారని, 1937లో యూపీ ప్రీమియర్‌గా ఉన్నప్పటికీ క్విట్ ఇండియా ఉద్యమం కోసం తన పదవికి రాజీనామా చేసి పోరాటంలోకి దిగారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యానంతరం 1950 నుండి 1954 వరకు యూపీ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని సుపరిపాలనకు నమూనాగా తీర్చిదిద్దారని కొనియాడారు. అనంతరం 1955 నుండి కేంద్ర హోం మంత్రిగా సేవలందిస్తూ భాషా వివాదాలను పరిష్కరించడంతో పాటు హిందీని అధికారిక భాషగా స్థిరపరచడంలో ముఖ్యభూమిక పోషించారని సీఎం తెలిపారు.